స్థానిక సమరం: విజయనగరం జిల్లాలో ముమ్మరంగా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగడంతో విజయనగరం జిల్లాలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం ఏడు వందల డెబ్బై ఏడు పంచాయతీలు ఉండగా, కోర్టు కేసులున్న రెండు మినహాయించి ఏడు వందల డెబ్బై ఐదు చోట్ల ఎన్నికలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. పోలింగ్‌కు తక్కువ గడువు ఉండటంతో అభ్యర్థుల్లో హైరానా నెలకొంది.