రికార్డు స్థాయిలో మూడు లక్షలు పలికిన గణేష్ లడ్డూ
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం హనుమన్నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రికార్డు ధర పలికింది. పర్నే రవీందర్రెడ్డి మరియు ధనమ్మ దంపతులు మూడు లక్షల పది వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తులు విజేతలను ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువజన సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.