హుజూరాబాద్‌లో భారీ పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసమై గృహోపకరణాలు దగ్ధం
రిపోర్టర్: హరి
స్థలం: హుజూరాబాద్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ పరిధిలోని గాంధీనగర్ 23వ వార్డులో రాత్రి భారీ వర్షం బీభత్సం సృష్టించింది. స్థానికుడు పైడాకుల సురేష్ నివాసంపై ఒక్కసారిగా పిడుగు పడటంతో భవనం తీవ్రంగా దెబ్బతింది. కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అయితే పిడుగుపాటు తీవ్రతకు ఇళ్లలోని విద్యుత్ మీటర్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల సుమారు 20 ఇళ్లలో నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తమను తగిన నష్టపరిహారంతో ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.