గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తామన్న కూటమి అభ్యర్థులు
రిపోర్టర్: MADHIRI CHANTIBABU
స్థలం: జి.కె.వీధి
గూడెంకొత్తవీధి మండలంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి వీర వెంకట్, ఎంపీటీసీ అభ్యర్థిని రాజేశ్వరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రజలు తమను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.