కిడ్స్ పార్క్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ పరిధిలోని కిడ్స్ పార్క్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను పోషించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి, బోధనా వృత్తిలోని బాధ్యతలను, క్రమశిక్షణను స్వయంగా అనుభవించారు.

ఈ వినూత్న కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని పెంచడమే కాకుండా, బాధ్యతాయుతమైన భావనలను విద్యార్థుల్లో కలిగించేలా ఈ వేడుకలు నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొంది.