కొయ్యూరు 108లో సుఖ ప్రసవం.. తల్లి, శిశువు క్షేమం!

రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు స్థలం: కొయ్యూరు

కొయ్యూరు మండల పరిధిలో 108 అంబులెన్స్లో ఓ గర్భిణికి సుఖ ప్రసవం జరిగింది. కునుకూరు గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఈఎంటీ కొండరావు, పైలట్ కొప్పు వినోద్ గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవం జరిగింది. సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి తల్లి, మగ శిశువుకు ప్రాథమిక వైద్యం అందించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.