టీఏ 2 పరీక్షలో ప్రథమ ర్యాంక్ సాధించిన పునర్వి

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లా కేంద్రంలోని త్రివేణి పాఠశాల ఆరవ తరగతి విద్యార్థిని కాసోజు పునర్వి టీఏ 2 పరీక్షలో ప్రథమ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ విద్యార్థినిని ఘనంగా అభినందించారు. క్రమశిక్షణతో పాటు పట్టుదలతో చదివితే విద్యార్థులు భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.