స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు
రిపోర్టర్: మహేష్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా తెదేపా కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కూటమి నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ ఎన్నికలతో పాటు నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీల ఎన్నికలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం విజయం సాధించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ చింతకాయల విజయ్ తో పాటు కూటమి ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.