కామన్వెల్త్ కబడ్డీలో భారత జట్ల జైత్రయాత్ర: అజేయంగా టైటిల్స్ కైవసం
రిపోర్టర్: నరేష్
స్థలం: అహ్మదాబాద్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి కామన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షిప్ లో భారత పురుషుల, మహిళల జట్లు అద్భుత విజయాలు సాధించి టైటిల్స్‌ను కైవసం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల ఫైనల్ లో ఉగాండాపై ముప్ పై ఐదు - పదిహేను తేడాతో గెలుపొందగా, పురుషుల ఫైనల్ లో శ్రీలంకను యాభై నాలుగు - ఇరవై తేడాతో చిత్తు చేశాయి. ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి లేకుండానా అజేయంగా సాగిన భారత జట్లు టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి దేశకీర్తిని ఇనుమడింపజేశాయని క్రీడాకారులు వెల్లడించారు.