టెక్నాలజీ వినియోగదారులకు గుడ్ న్యూస్: కొత్త ఫీచర్లతో యాపిల్ సాఫ్ట్వేర్ అప్డేట్లు విడుదల
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్ ఐఓఎస్ మరియు వాచ్ ఓఎస్ ల కొత్త డెవలపర్ బీటా అప్డేట్లను విడుదల చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా సిరి ఏఐ మరియు హెల్త్ యాప్ లో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ అప్డేట్ల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని, త్వరలోనే పూర్తిస్థాయిలో ఇవి విడుదలవుతాయని టెక్ నిపుణులు పేర్కొన్నారు.