స్థానిక ఎన్నికల్ లో కూటమి విజయం సాధించాలంటూ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పిలుపు
రిపోర్టర్: రాము
స్థలం: భమిని
స్థానిక ఎన్నికల్ లో కూటమి విజయమే లక్ష్యంగా అంతా సమన్వయంతో పనిచేయాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం బత్తిలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ పార్టీకి స్థానిక ఎన్నికల్ లో ఓటు రూపంలో గట్టి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.