అంటార్కిటికాలోని మైత్రి రీసెర్చ్ స్టేషన్లో ఘనంగా వినాయక చవితి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Antarctica

అంటార్కిటికాలోని మైత్రి పరిశోధనా కేంద్రంలో భారతీయ శాస్త్రవేత్తలు వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నట్లు డాక్టర్ అనిరుధ్ ధర్ వెల్లడించారు. మంచుతో సుందరమైన వినాయకుడి ప్రతిమను తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చినట్లు తెలిపారు. కుటుంబానికి దూరంగా అత్యంత శీతల ప్రాంతంలోనూ మన సంప్రదాయాలను ఘనంగా చాటుతూ పర్యావరణహిత వేడుకలు నిర్వహించడం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోందని ఆయన పేర్కొన్నారు.