రణబాలి సినిమాకు సౌండ్ లెవల్ పెంచాలంటూ థియేటర్ల యజమానులకు చిత్ర యూనిట్ విజ్ఞప్తి

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న జంటగా నటించిన సరికొత్త చిత్రం రణబాలి థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ను ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించేలా ఆడియో సౌండ్ను ఆరు లేదా ఆరున్నర లెవల్కు పెంచి ప్లే చేయాలని చిత్ర బృందం థియేటర్ల యాజమానులను కోరినట్లు మూవీ టీమ్ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టినట్లు వెల్లడించారు.