రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల వాయిదా: నూతన షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసీ పునేఠా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. వచ్చే నెల 3న జరగాల్సిన పోలింగ్ను 5వ తేదీకి, ఓట్ల లెక్కింపును 7వ తేదీకి మారుస్తూ ఎస్ఈసీ అనిల్చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు మరియు పోలింగ్ సిబ్బంది కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని ఎస్ఈసీ స్పష్టం చేశారు.