తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్ ఎంట్రీ: టీవీకే పార్టీ స్పందన
రిపోర్టర్: రమేష్
స్థలం: చెన్నై
తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్ ఎంట్రీ ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై తమిళగ వెట్రి కళగం పార్టీ అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ స్పందించారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, ధనుష్ రాకను స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీని స్థాపించడం, దానిని నిలబెట్టడం సులభం కాదని, పూర్తి సమయం కేటాయించాల్సి ఉంటుందని ఎం. సత్యకుమార్ స్పష్టం చేశారు.