ఆస్తుల బదిలీ కోరుతూ లాస్ ఏంజిల్స్ కోర్టును ఆశ్రయించిన పారిస్ జాక్సన్

రిపోర్టర్: మహేష్ స్థలం: లాస్ ఏంజిల్స్

పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కుమార్తె పారిస్ జాక్సన్ లాస్ ఏంజిల్స్ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తన తండ్రి ఎస్టేట్ నుంచి ఆరు వందల మిలియన్ల డాలర్లను ఫ్యామిలీ ట్రస్టుకు బదిలీ చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టుకు ఎటువంటి రాబడి లేకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే న్యాయపరమైన చిక్కుల కారణంగానే డొనేషన్లు ఆపినట్లు ఎస్టేట్ నిర్వాహకులు స్పష్టం చేశారు.