పొదలకూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ట్రాక్టర్ను ఢీకొన్న బైక్ వ్యక్తికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: పొదలకూరు

పొదలకూరు మండలం వనంతోపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రవీంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. బైక్ పై వెళ్తుండగా ముందున్న ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఆ వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే 108 సిబ్బంది క్షతగాత్రుడిని పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.