నాని 'ది ప్యారడైజ్' మూవీకి 'ఏ' సర్టిఫికెట్ ఖరారు

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' రఫ్ కట్ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. భారీ యాక్షన్, రక్తపాతం మరియు ఘాటైన సంభాషణలు ఉండటంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.