నల్లగొండ ఆశ్రమం నుంచి ముంబై బాలుడు పరార్
రిపోర్టర్: రమేష్
స్థలం: నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలోని గంధవారిగూడెంలోని రోగట్టె స్నేహ భావన ఆశ్రమం నుంచి ముంబైకి చెందిన 12 ఏళ్ల షారుక్ ఖాన్ మహమ్మద్ ఈ నెల 15న పారిపోయాడు. ముంబై నుంచి సికింద్రాబాద్ మీదుగా నల్లగొండకు చేరుకున్న బాలుడిని చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా ఆశ్రమంలో చేర్చగా, నిర్వాహకులు వారం రోజుల పాటు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.