స్థానిక పోరులో వైసీపీ లీగల్ వ్యూహం: సజ్జల రామకృష్ణారెడ్డి కీలక దిశానిర్దేశం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Amaravati

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ లీగల్ సెల్ సమావేశం నిర్వహించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల విధానాన్ని ప్రభుత్వం తక్షణమే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు అభ్యర్థులకు న్యాయపరమైన అండదండలు అందించాలని, అక్రమాలను చట్టబద్ధంగా తిప్పికొట్టేందుకు లీగల్ టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.