హైదరాబాద్ లో భారీ సైబర్ మోసం గుట్టురట్టు: అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారని అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ ఫొటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరమైన వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నార్సింగి పోలీసులు స్పష్టం చేశారు.