భక్త రామదాసు మందిరానికి 300 గజాల స్థల విరాళం

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరం ఎదురుగా ఉన్న 300 గజాల స్థలాన్ని దాతలు మరల ప్రమీలాదేవి, మరల అన్నపూర్ణ భద్రాచలం దేవస్థానానికి విరాళంగా అందించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ పత్రాలను భద్రాచలం సూపరింటెండెంట్ నిరంజన్ స్వయంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్తలు సాధు రాధాకృష్ణమూర్తి, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, మన్నె కోటేశ్వరరావు, పూజారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.