మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు తప్పవు
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా కేంద్రంలోని అయ్యన్నపేటలో వివిధ కేసుల్లో పట్టుబడిన మైనర్లకు ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో తల్లిదండ్రుల సమక్షంలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రిపుల్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు వాహనాల సైలెన్సర్లు తొలగించి శబ్ధ కాలుష్యానికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇకపై మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహనాలు సీజ్ చేసి తల్లిదండ్రులు, వాహన యాజమానులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.