స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటిన మిత్రులు

రిపోర్టర్: Durgam Syam స్థలం: సీతారామపురం

సీతారాంపురం మండలంలో అనారోగ్యంతో మృతి చెందిన మిత్రుడు దుర్గయ్య కుటుంబాన్ని పూర్వ విద్యార్థులు ఆదుకున్నారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న 1996-2001 బ్యాచ్ మిత్రులు ఒక్కటై సోమవారం రూ.36 వేల ఆర్థిక సాయం అందజేశారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు.