అర్ణబ్ తుఫాన్ వరద ఉధృతిపై సాలూరులో సంధ్య రాణి పరిశీలన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: పార్వతీపురం మన్యం

అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ను వరద నీరు ముంచెత్తడంతో పాటు పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని సంధ్య రాణి పార్వతీపురం వెల్లడించారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, పంట పొలాలు, ఇళ్లను స్వయంగా పరిశీలించానని ఆమె తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వెంటనే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని పేర్కొంటూ, దెబ్బతిన్న మౌలిక వసతులకు తక్షణమే మరమ్మతులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.