గర్భిణీ ప్రయాణికులకు లోయర్ బెర్త్ కేటాయింపులపై రైల్వేశాఖ కీలక నిర్ణయం

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

గర్భిణీ స్త్రీల సౌకర్యవంతమైన ప్రయాణం కోసం భారతీయ రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిందని అధికారులు తెలిపారు. ఐఆర్సీటీసీ యాప్ లేదా అధికారిక పోర్టల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సమయంలో గర్భిణుల కోసం లోయర్ బెర్త్ కేటాయింపునకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్లైన్లో బెర్త్ దక్కని పక్షంలో వైద్య ధృవీకరణ పత్రంతో రిజర్వేషన్ కౌంటర్ను సంప్రదించి లోయర్ బెర్త్ పొందవచ్చని పేర్కొన్నారు. స్లీపర్ క్లాస్లో ఆరు నుంచి ఏడు, థర్డ్ ఏసీలో నాలుగు నుంచి ఐదు బెర్త్లు కేటాయిస్తున్నట్లు వివరించారు.