'భూదాన్ భూములపై ఫొరెన్సిక్ ఆడిట్ చేయాలి': ఎమ్మెల్యే కూనంనేని సంబశివ రావు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

కమ్యూనిస్టులు లేకుండా రాష్ట్రంలో ఎక్కడా భూపోరాటాలు జరగలేదని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సంబశివ రావు స్పష్టం చేశారు. శాసనసభలో 22ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, ధరణి తప్పిదాలతో ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, భూదాన్ భూముల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని, నిజాం హయాంలోని సర్ఫ్‌ఖాన్ భూములను వెలికితీసి పేదలకు పంచాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.