శ్రీహరికోట షార్ ఆస్పత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ప్రారంభం
రిపోర్టర్: రాజేష్
స్థలం: నాయుడుపేట
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయం మరియు ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు శ్రీహరికోటలోని షార్ ఆస్పత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఘనంగా ప్రారంభించినట్లు ఎస్డీఎస్సీ షార్ డైరెక్టర్ ఎస్ ముత్తుచెజియన్ తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో షార్ సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని సుమారు వంద యూనిట్ల వరకు రక్తదానం చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.