మంచిర్యాలలో రాళ్లవాగు బ్రిడ్జి పనులపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమీక్ష

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మంచిర్యాల

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని రాళ్లవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించి, తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.