సెప్టెంబర్ 27న బ్యాంకు ఖాతాదారులు సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచన
రిపోర్టర్: రమేష్
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లాలో సెప్టెంబర్ 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం నాడు అన్ని ప్రభుత్వ రంగ మరియు గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్ పార్వతీపురం మన్యం వెల్లడించారు. ఈ ప్రత్యేక సడలింపును జిల్లా ప్రజలు, ఖాతాదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నగదు జమలు, విత్‌డ్రాలు, పాస్‌బుక్ అప్డేట్లు, చెక్కుల క్లియరింగ్‌లు, ఫండ్ ట్రాన్స్ఫర్లు అలాగే రుణ సేవలు అన్నీ యథావిధిగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.