అక్రమ కేసులతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ బాధితురాలి ఆవేదన

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు కలెక్టరేట్ సమీపంలోని పత్రిక విలేకరుల భవనంలో గొల్లపూడి షర్మిల మీడియా సమావేశంలో కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్త గొల్లపూడి శ్రావణ్ కుమార్ శర్మపై వేమిరెడ్డి దంపతులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా జైల్లో పెట్టారని, తమ పిల్లలు తండ్రి కోసం పరితపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాటి మహిళగా ఎస్పీ స్పందించి తన భర్తను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.