సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐ ఫోటోలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా 80వ దశకం ట్రెండ్ నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన 80s ఏఐ జనరేటెడ్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వింటేజ్ లుక్ ఫోటోలను చూసి ఆయన అభిమానులు అమితంగా ఆనందిస్తున్నారు.