'ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి': టేకులపల్లిలో విశ్వకర్మ జయంతి వేడుకలు

రిపోర్టర్: సతీష్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి విశ్వకర్మ భగవానుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. మంతోజు పవన్ కుమార్ చార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తౌడోజు భిక్షమయ్య, ధర్మపురి శ్రీనివాసచారి, చంద్రగిరి రాధాకృష్ణతో పాటు పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.