కాల్బ్ విలియమ్స్ గాయంపై ఆంటోని బ్రౌన్ వివాదాస్పద పోస్ట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: USA
చికాగో బేర్స్ క్వార్టర్ బ్యాక్ కాల్బ్ విలియమ్స్ మైదానంలో గాయపడి స్ట్రెచర్ పై వెళ్లడంపై మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు ఆంటోని బ్రౌన్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా స్పందించారు. మిన్నెసోటా వైకింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విలియమ్స్ కుడి కాలి పిక్కకు గాయమవ్వగా, ఆంటోని బ్రౌన్ దీనిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంఆర్ఐ స్కానింగ్ లో పెద్దగా ప్రమాదం లేదని తేలడంతో బేర్స్ జట్టు ఊపిరి పీల్చుకుంది.