హైదరాబాద్ లో భారీ మోసం గుట్టురట్టు: నకిలీ ఆర్థిక శాఖ అధికారి అరెస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
ప్రజలను, ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న నకిలీ ఆర్థిక శాఖ అధికారిని హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ఫోర్స్, ఫిల్మ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీపీసీ సస్పెండెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ అయిన తోట బాలాజీ నాయుడు ఉన్నతాధికారిగా నటిస్తూ ఈ మోసాలకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడి నుంచి నకిలీ గుర్తింపు కార్డులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.