తూప్రాన్ లో భారీ కార్డన్ సెర్చ్: వందలాది ఇళ్లలో తనిఖీలు

రిపోర్టర్: రాము స్థలం: తూప్రాన్

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో సుమారు 137 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్ లో పాల్గొన్నారు. సుమారు 450 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.