ఐఐటీ మద్రాస్ విద్యార్థి ప్రతిభ: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న సుధాన్షు కుమార్
రిపోర్టర్: నరేష్
స్థలం: చెన్నై
ఐఐటీ మద్రాస్ బీఎస్ డేటా సైన్స్ ప్రోగ్రామ్లో చేరుతున్నప్పుడు ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనకు కొత్త అని విద్యార్థి సుధాన్షు కుమార్ యాదవ్ తెలిపారు. భౌతిక శాస్త్ర నేపథ్యం నుంచి వచ్చినా, క్రమంగా సాంకేతిక అంశాలపై పట్టు సాధించి జపాన్లోని టోక్యో యూనివర్సిటీ లాంటి ప్రముఖ సంస్థలలో ఇంటర్న్షిప్లు, పరిశోధన అవకాశాలు దక్కించుకున్నట్లు ఆయన వెల్లడించారు.