జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారం: ఏపీకి ఈవీఓఐ ప్రథమ స్థానం దక్కించుకుంది
రిపోర్టర్: సతీష్
స్థలం: దిల్లీ
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించిందని అధికారులు వెల్లడించారు. ఈజ్ ఆఫ్ వెహికల్ ఓనర్షిప్ ఇండెక్స్-2026లో ప్రథమ స్థానాన్ని ఏపీ దక్కించుకుంది. పాత వాహనాల యాజమాన్య బదిలీల్ లో పారదర్శకత, జవాబుదారీతనం ఆధారంగా ప్రైవేట్ సంస్థలు ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేశాయి. దిల్లీలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా చేతుల మీదుగా ఏపీ భవన్ లైజన్ ఆఫీసర్ ప్రభాకర్ ఈ పురస్కారాన్ని బుధవారం అందుకున్నారు.