నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

రిపోర్టర్: హరి స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం దంటుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాజర్ల మారేశ్ మృతి చెందారు. ముందు వెళ్తున్న టీవీఎస్ వాహనాన్ని వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనంలో వింజమూరు సామాజిక వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.