సాహితి ఇన్ఫ్రాటెక్ మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే అరికెపూడికి ఈడీ సమన్లు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
సాహితి ఇన్ఫ్రాటెక్ మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. సాహితి సంస్థ ప్రాజెక్టుల పేరుతో రూ.842 కోట్ల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు ఉండగా, ఎమ్మెల్యే ఖాతాల ద్వారా రూ.2.1 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ, ఆర్థిక లావాదేవీల స్వభావంపై దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు.