చండీగఢ్‌లో ఉబర్, రాపిడో లైసెన్సులు ఆరు నెలలు సస్పెండ్
రిపోర్టర్: రాజేష్
స్థలం: చండీగఢ్
చండీగఢ్‌లో నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ప్రముఖ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఉబర్, రాపిడో లైసెన్సులను స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఇప్పటికే ఓలా, ఇన్‌డ్రైవ్ లైసెన్సులు కూడా రద్దు కావడంతో నగరంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల పాటించని కారణంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.