ఓటర్ల హక్కుల పరిరక్షణే ఈసీ బాధ్యత: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రిపోర్టర్: సురేష్ స్థలం: పెద్దపల్లి

ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని గడ్డం వంశీకృష్ణ - ఎంపీ పెద్దపల్లి పేర్కొన్నారు. ఓటర్ల హక్కులపై వ్యక్తమవుతున్న ఆందోళనలను విస్మరించలేమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పూర్తి జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత అత్యంత కీలకమని ఆయన తేల్చిచెప్పారు.