వైరల్ రీల్ కోసం దారుణం: వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
రిపోర్టర్: శివ
స్థలం: Kolkata
వైరల్ రీల్ కోసం కొందరు యువకులు చేసిన ఘాతుకం కోల్కతాలో సంచలనం సృష్టించిందని పోలీసులు తెలిపారు. గర్ఫా ప్రాంతంలో ఇంటికి వెళ్తున్న వ్యక్తిని అడ్డుకున్న నిందితులు, ఆట పేరుతో అతడి కళ్లకు గంతలు కట్టి బలవంతంగా పెట్రోల్ తాగించేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించడంతో అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు.