ఫోన్ నంబర్ లేకుండానే సిగ్నల్ యాప్ ఖాతా సృష్టించే ఫీచర్

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

ప్రముఖ మెసేజింగ్ యాప్ సిగ్నల్ తన యూజర్ల ప్రైవసీ కోసం కీలక అడుగు వేసింది. ఇప్పటివరకు ఖాతా తెరవాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉండగా, తాజాగా ఫోన్ నంబర్ లేకుండానే ఖాతా సృష్టించుకునే ఫీచర్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 8.28లో అందుబాటులో ఉంది.