మహిళలకు తీపి కబురు: వంద కోట్లకు చేరిన ఉచిత బస్సు ప్రయాణాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు వంద కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకున్నట్లు ఏపీఎస్ఆర్టీసి ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు వెల్లడించారు. ఈ పథకం ద్వారా మహిళలకు సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రయాణ ఖర్చు ఆదా అయిందని, ప్రతిరోజూ సగటున ఇరవై నాలుగు లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.