ఎన్నికల సంఘం తీరుపై రాహుల్ గాంధీ నిప్పులు: సీఈసీ రాజీనామాకు డిమాండ్

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించినట్లు మీడియా తెలిపింది. పార్లమెంట్ నుంచి నిర్వాచన్ భవన్ వరకు చేపట్టిన ఈ మార్చ్లో ఇండియా కూటమి నేతలు ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాల్గొన్నారు. ఓట్ల తొలగింపునకు నిరసనగా రాహుల్ గాంధీ బారికేడ్ ఎక్కి నిరసన తెలిపారు.