మీనాక్షీ నటరాజన్ విదేశీ పర్యటనపై నాంపల్లి కోర్టులో పిటిషన్

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో శ్రీలత అనే బాధితురాలు పిటిషన్ దాఖలు చేశారు. ఆమెపై ఇప్పటికే రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నందున పాస్‌పోర్ట్‌ను జప్తు చేయాలని కోరారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ కేసుల వివరాలు వెల్లడించకపోవడంతో గతంలో ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.