సముద్రంలో విషాదం: పీజీపేట తీరంలో ఊబిలో చిక్కుకుని నలుగురు యువతీయువకులు దుర్మరణం
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం గ్రామీణ మండలం పీజీపేట సముద్ర తీరంలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు యువతీయువకులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఉపాధి శిక్షణ కోసం వెళ్లి సరదాగా సముద్ర తీరానికి వెళ్లిన నలుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు ఊబిలో దిగి నీట మునిగి మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.