'గని కూలి 67 మంది మృతి': సూడాన్‌లో భారీ విషాదం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: సుడాన్
సూడాన్‌లోని వెస్ట్ కోర్డోఫ్యాన్ ప్రావిన్స్‌లో బంగారు గని అకస్మాత్తుగా కుప్పకూలిన ప్రమాదంలో ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో గనిలో పనిచేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకోగా, సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అనధికారిక తవ్వకాలు, తక్కువ భద్రతా ప్రమాణాల కారణంగా ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించగా, గనిలో మరికొందరు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.