ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఎన్టీఆర్ వైద్యసేవకు నేరుగా నిధులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వైద్య సేవల కోసం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఖాతాకు నేరుగా నిధులు జమ చేసేలా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు కోరడంతో అక్టోబర్ ఒకటి నుంచి ప్రతినెల మొదటి తేదీనే ట్రెజరీ ద్వారా నిధులు బదిలీ కానున్నాయి. దీంతో గతంలో ఎదురైన జాప్య సమస్యలు తొలగిపోయి ఆస్పత్రులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడం సాధ్యమవుతుందని స్పష్టమైంది.